యాక్టింగ్‌ మానేస్తే ఆ పనే చేస్తా: సాయిపల్లవి

ABN , First Publish Date - 2020-12-08T19:27:55+05:30 IST

'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న తమిళ పొన్ను సాయిపల్లవి. ఈ అమ్మడు తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

యాక్టింగ్‌ మానేస్తే ఆ పనే చేస్తా: సాయిపల్లవి

'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న తమిళ పొన్ను సాయిపల్లవి. ఈ అమ్మడు తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వెండితెరతో పాటు డిజిటల్‌ రంగంలోకి కూడా సాయిపల్లవి ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా సాయిపల్లవి నటించిన వెబ్‌ సిరీస్‌ 'పావ కదైగల్‌'. నాలుగు కథల సమాహారంగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను విఘ్నేశ్‌ శివన్‌, సుధాకొంగర, గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌ తెరకెక్కించారు. డిసెంబర్‌ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తండ్రి పాత్రల ప్రకాశ్‌రాజ్‌తో కలిసి నటించడానికి భయపడ్డానని, ఆయన గంభీరత చూసి ఆ భయం కలిగేదని, సెట్‌లో ఉండేటప్పుడు ఆయన పాత్రలోనే ఉండేవారని సాయిపల్లవి పేర్కొంది. డాక్టర్‌ కోర్సు చదివి యాక్టర్‌ అయిన సాయిపల్లవిని..మరి డాక్టర్‌గా మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు అని అడిగితే, సినిమాల నుండి రిటైర్ అయిన తర్వాత వైద్యవృత్తిపైనే దృష్టిపెడతా అని సమాధానమిచ్చింది సాయిపల్లవి. 


Updated Date - 2020-12-08T19:27:55+05:30 IST