`సాహో`కు ఏడాది.. ట్రెండింగ్‌లో టాప్!

ABN , First Publish Date - 2020-08-31T16:43:33+05:30 IST

`బాహబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం `సాహో`.

`సాహో`కు ఏడాది.. ట్రెండింగ్‌లో టాప్!

`బాహబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం `సాహో`. యువ దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ చిత్రం కళ్లు చెదిరే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలై ఆదివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. 


ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభాస్ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. `బాంగ్ బాంగ్` వీడియో సాంగ్‌తోపాటు `సాహో` పోస్టర్‌ను కూడా పంచుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రద్ధా కపూర్ కూడా `సాహో` ఫొటోలను, వీడియోలను పంచుకుంది. 
Updated Date - 2020-08-31T16:43:33+05:30 IST