నేను క్షేమంగానే ఉన్నాను: ఎస్.జానకి

ABN , First Publish Date - 2020-06-29T19:16:27+05:30 IST

దిగ్గజ గాయని ఎస్.జానకి మరణించారనే వదంతులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి

నేను క్షేమంగానే ఉన్నాను: ఎస్.జానకి

దిగ్గజ గాయని ఎస్.జానకి మరణించారనే వదంతులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఈ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చూసిన జానకి అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందారు. జానకి ఆరోగ్యంగానే ఉన్నారని, దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చెయ్యొదని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటన చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జానకి స్పందించారు. తన గురించి ఎవరూ ఆందోళన చెందొద్దని, తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. `ఎందుకు పదే పదే ఇలాంటి పిచ్చి వార్తలు సృష్టిస్తారు. నా క్షేమం గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు వార్తల వల్ల ఎవరికి ప్రయోజనం. నేను క్షేమంగానే ఉన్నాను. మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండండ`ని జానకి సూచించారు. 

Updated Date - 2020-06-29T19:16:27+05:30 IST