‘సినం’ కోసం రూ.45లక్షలతో భారీ సెట్‌

ABN , First Publish Date - 2020-02-27T15:50:04+05:30 IST

ఇటీవల విడుదలైన ‘మాఫియా’తో ప్రశంసలందుకుంటున్న అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న మరో చిత్రం ‘సినం’. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం

‘సినం’ కోసం రూ.45లక్షలతో భారీ సెట్‌

ఇటీవల విడుదలైన ‘మాఫియా’తో ప్రశంసలందుకుంటున్న అరుణ్‌ విజయ్‌ నటిస్తున్న మరో చిత్రం ‘సినం’. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌  షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం చెన్నై శివారు ప్రాంతం పడప్పైలో రూ.45లక్షలతో భారీ సెట్‌ వేశారు. ఇక్కడ సినిమాలోనే హైలెట్‌గా నిలిచే భారీ యాక్షన్‌ సీన్‌ తెరకెక్కిస్తున్నారట. మూవీ స్లైడ్స్‌ బ్యానర్‌పై ఆర్‌.విజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీఎన్‌ఆర్‌ కుమరవేలన్‌ దర్శకత్వం వహిస్తుండగా, ‘కుప్పత్తురాజా’ ఫేమ్‌ పాలక్‌ లల్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. హాస్యనటుడు కాళి వెంకట్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కళా దర్శకుడు మైఖేల్‌ పర్యవేక్షణలో పడప్పైలో స్లమ్‌ను తలపించేలా భారీ సెట్‌ నిర్మిస్తున్నారని, ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు.

Updated Date - 2020-02-27T15:50:04+05:30 IST