వెండితెర నుండి బుల్లితెరపైకి రుద్రమదేవి జీవిత కథ

ABN , First Publish Date - 2020-12-22T01:26:17+05:30 IST

సినిమా రూపంలో ఆకట్టుకున్న రుద్రమదేవి జీవితకథ సీరియల్ రూపంలో ప్రసారం కానుంది.

వెండితెర నుండి బుల్లితెరపైకి రుద్రమదేవి జీవిత కథ

మహిళాశక్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి రాణీ రుద్రమదేవి. 13వ శతాబ్దానికి చెందిన మహారాణి. కాకతీయ వీరవనిత. యువరాణిగా రాజకుటుంబంలో జన్మించిన ఆమె, యువరాజుగా జీవితం సాగించడంతో పాటుగా శిక్షణ పొందుతూ సింహాసనాన్ని దుష్టశక్తుల బారినపడకుండా  కాపాడుతుంది. మహిళలకు రాజ్యాధికారం పట్ల సమాజంలో ఉన్న భావనలను పోగొట్టడమే కాదు, చక్రవర్తిగానూ ఆమె అసమాన పోరాట పటిమ చూపారు. ఈమె జీవితాన్ని డైరెక్టర్‌ గుణశేఖర్‌ భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాణీ రుద్రమదేవి జీవిత కథను బుల్లితెరపైకి సీరియర్‌ రూపంలో తీసుకు వస్తున్నారు. స్టార్‌ మా ఛానెల్‌లో ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఈ షో మోషన్‌ పోస్టర్‌ ఇప్పటికే  ప్రదర్శితం కాగా  తొలిసారిగా ప్రోమో పై ప్రకటనను  బిగ్‌బాస్‌ 4 తెలుగు ఫైనల్‌లో భాగంగా  బిగ్‌బాస్‌ సీజన్‌ 4 హోస్ట్‌ నాగార్జున చేయడం విశేషం.

Updated Date - 2020-12-22T01:26:17+05:30 IST