‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సంచలనం

ABN , First Publish Date - 2020-08-31T03:16:32+05:30 IST

తెలుగులో దారుణంగా పరాజయం పాలైన చిత్రాలు కూడా అక్కడ ఘన విజయం సాధిస్తాయి. తెలుగులో హిట్ కొట్టిన చిత్రాలు అక్కడ డబుల్ హిట్‌ని అందుకుంటూ ఉంటాయి. అలాంటి

‘రుద్రమదేవి’ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో సంచలనం

తెలుగులో దారుణంగా పరాజయం పాలైన చిత్రాలు కూడా అక్కడ ఘన విజయం సాధిస్తాయి. తెలుగులో హిట్ కొట్టిన చిత్రాలు అక్కడ డబుల్ హిట్‌ని అందుకుంటూ ఉంటాయి. అలాంటి మార్కెట్ ఏమిటి అనుకుంటున్నారా? హిందీ డబ్బింగ్ మార్కెట్. టాలీవుడ్ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయిన చిత్రాలు హిందీలో డబ్ అయి, అక్కడ యూట్యూబ్‌లో విడుదలై మిలియన్ల వ్యూస్ సాధిస్తూ.. అందరినీ ఔరా అనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు హిందీలో డైరెక్ట్‌గా విడుదలైన తెలుగు నటీనటుల చిత్రం ఒకటి.. యూట్యూబ్‌లో 150 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించి.. అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవానికి ఆ చిత్రం టాలీవుడ్‌లో అంత గొప్పగా ఏమీ ఆడలేదు కూడా. సరే ఇంతకీ ఆ చిత్రం ఏమిటనుకుంటున్నారా? అనుష్క నటించిన ‘రుద్రమదేవి’.


గుణ టీమ్ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లలో రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని పాత్రలు ఎంతో చక్కగా కుదిరాయి. ఛాలా రిచ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ప్రేక్షకులు ఈ చిత్రానికి ఊహించిన విజయాన్ని అందివ్వలేకపోయారు. అయినా సరే.. చాలా గొప్ప చిత్రంగా గుర్తింపు తెచ్చుకుందీ చిత్రం. ఇప్పుడీ చిత్రం హిందీ 2డి వెర్షన్ యూట్యూబ్‌లో 150 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించినట్లుగా చెబుతూ.. గుణ టీమ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్‌లో.. చిత్రంలోని గోనగన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ స్టిల్‌ను విడుదల చేశారు.



Updated Date - 2020-08-31T03:16:32+05:30 IST