సెంథిల్ కుమార్‌కు ‘ఆర్ఆర్ఆర్’ బ‌ర్త్ డే విషెష్‌

ABN , First Publish Date - 2020-07-29T17:54:47+05:30 IST

సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్... ఈ పేరు విన‌గానే మ‌న‌కు చ‌టుక్కున్న గుర్తుకొచ్చే సినిమాలు సై, మ‌గ‌ధీర‌, అరుంధ‌తి, చ‌త్ర‌ప‌తి, ఈగ, బాహుబ‌లి చిత్రాలే.

సెంథిల్ కుమార్‌కు ‘ఆర్ఆర్ఆర్’ బ‌ర్త్ డే విషెష్‌

సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్... ఈ పేరు విన‌గానే మ‌న‌కు చ‌టుక్కున్న గుర్తుకొచ్చే సినిమాలు సై, మ‌గ‌ధీర‌, అరుంధ‌తి, చ‌త్ర‌ప‌తి, ఈగ, బాహుబ‌లి చిత్రాలే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో క‌లిసి విజువ‌ల్ వండ‌ర్స్‌ను క్రియేట్ చేయ‌డంలో సెంథిల్ కుమార్ పాత్ర ఎంతో కీల‌కం. ఇప్పుడు ఈయ‌న మ‌రోసారి రాజ‌మౌళితో క‌లిసి ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. బుధ‌వారం సెంథిల్ కుమార్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ‘ఆర్ఆర్ఆర్‌’ యూనిట్ ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా సెంథిల్ కుమార్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేసింది. ‘మీ లెన్స్‌తో మేజిక్ క్రియేట్ చేస్తారు. ఆ మేజిక్‌ను చూడ‌టానికి ఆగ‌లేక‌పోతున్నాం’ అని ‘ఆర్ఆర్ఆర్‌’ యూనిట్ ట్వీట్ చేసింది. 
Updated Date - 2020-07-29T17:54:47+05:30 IST