‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చలికి వణుకుతోంది.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-11-17T04:06:28+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. రీసెంట్‌గానే మళ్లీ సినిమా షూటింగ్‌లకు కొన్ని నిబంధనలను విధిస్తూ అనుమతులు వచ్చాయి. అనుమతులు

‘ఆర్ఆర్ఆర్’ టీమ్ చలికి వణుకుతోంది.. వీడియో వైరల్

కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. రీసెంట్‌గానే మళ్లీ సినిమా షూటింగ్‌లకు కొన్ని నిబంధనలను విధిస్తూ అనుమతులు వచ్చాయి. అనుమతులు వచ్చినా.. పరిస్థితులన్నీ చూసుకుని మాత్రమే సెట్స్‌పైకి వెళ్లేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలా ప్లాన్ చేసుకునే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలైంది. అసలే చలికాలం.. అందులో రాత్రిపూట షూటింగ్.. ఇక టీమ్ పరిస్థితి ఎలా ఉందో ఉదహరిస్తూ.. తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ వీడియోని షేర్ చేసింది. అందరూ చలికి వణికిపోతూ.. వేడి మంటల వద్ద చలికాచుకుంటున్నారు. సెట్‌లో హీటర్స్‌ని కూడా ఏర్పాటు చేయడంతో.. షాట్ గ్యాప్‌లో హీటర్ వద్దకి వచ్చి వేడినింపుకుంటున్నారు. ఎన్ని చలిగాలులు వీచినా.. మా టీమ్ మాత్రం ధృడనిశ్చయంతో పనిచేస్తుందని తెలిపేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Updated Date - 2020-11-17T04:06:28+05:30 IST