‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-08-08T00:48:06+05:30 IST

కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్‌ను టార్గెట్ చేసిందా? అంటే అవునని చెప్పక తప్పదు. టాలీవుడ్ అనే కాదు.. సుమారు 4 నెలల నుంచి ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్

‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్‌ను టార్గెట్ చేసిందా? అంటే అవునని చెప్పక తప్పదు. టాలీవుడ్ అనే కాదు.. సుమారు 4 నెలల నుంచి ప్రపంచం మొత్తాన్ని ఈ వైరస్ వణికిస్తుంది. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఇప్పటి వరకు అంతా జాగ్రత్తగానే ఉంటూ వచ్చారు. కానీ ఈ మధ్య ఎక్కువగా టాలీవుడ్‌లోని సెలబ్రిటీల పేర్లే వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ మొదలుకుని, రాజమౌళి ఫ్యామిలీ, స్మిత, ఎస్.పి. బాలు ఇలా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్యకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లుగా తెలుస్తుంది.


అసలైతే ఆయనకు ఇటీవల హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి స్టెంట్ వేసినట్లుగా వార్తలు వచ్చాయి. మరి అలాంటి ఆయన ఎంత జాగ్రత్తగా ఉండి ఉంటారో ఊహించవచ్చు. అయినా సరే కరోనా వదలలేదంటే.. ఈ మహమ్మారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ నిమిత్తం రాజమౌళి ఫ్యామిలీని ఏమైనా కలిసి ఉండొచ్చని, అందువల్లే దానయ్యను కూడా ఈ వైరస్ సోకి ఉండవచ్చని అనుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో వార్త రాగానే.. సెలబ్రిటీలు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు.Updated Date - 2020-08-08T00:48:06+05:30 IST

Read more