ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోల ఇంట్రో టీజర్స్‌‌.. స్పూఫ్‌లు వైరల్‌

ABN , First Publish Date - 2020-10-27T02:24:57+05:30 IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌స్‌తో

ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోల ఇంట్రో టీజర్స్‌‌.. స్పూఫ్‌లు వైరల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌, హైటెక్నికల్ వేల్యూ‌స్‌తో రూపుదిద్దుకుంటోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి భీమ్‌ ఇంట్రో టీజర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రామరాజు ఫర్‌ భీమ్‌ అంటూ.. రామ్‌ చరణ్‌ వాయిస్‌తో.. ఎన్టీఆర్‌ యాక్షన్‌తో వచ్చిన ఈ టీజర్‌ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ని సాధించింది.


ఇక ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోల పరిచయ టీజర్లకు సోషల్‌ మీడియాలో స్పూఫ్‌లు బయలుదేరాయి. రామరాజు, భీమ్‌ ఇంట్రో టీజర్లకు సంబంధించిన స్పూఫ్‌ వీడియోలను 'ఆర్‌ఆర్‌ఆర్‌' నిర్మాణ సంస్థ డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ తన అఫీషియల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడం విశేషం. అయితే వాళ్లు షేర్ చేయడానికి కారణం లేకపోలేదు. సేమ్‌ టు సేమ్‌ ఆ టీజర్‌ ఉన్నట్లే.. వారు చేసిన స్పూఫ్‌ వీడియోలు ఉండటంతో..  మీ అభిమానానికి అంతే లేదు.. మీ టాలెంట్‌తో అరిపించేస్తున్నారు. రామరాజు, భీమ్‌లను ఇలానే క్రియేట్‌ చేసి మాకు పంపండి.. అని తెలుపుతూ.. రామరాజు, భీమ్‌ పరిచయ స్పూఫ్‌ టీజర్లను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ షేర్‌ చేసింది.Updated Date - 2020-10-27T02:24:57+05:30 IST