సుధా కొంగరకు పడిపోయిన రౌడీ హీరో

ABN , First Publish Date - 2020-11-17T02:52:08+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్‌లో సినిమా చూసే భాగ్యం ప్రేక్షకుడికి లేకుండా పోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు లభించినా.. ప్రేక్షకులు మాత్రం కరోనా విషయంలో

సుధా కొంగరకు పడిపోయిన రౌడీ హీరో

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్‌లో సినిమా చూసే భాగ్యం ప్రేక్షకుడికి లేకుండా పోయింది. లాక్‌డౌన్ అనంతరం థియేటర్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు లభించినా.. ప్రేక్షకులు మాత్రం కరోనా విషయంలో భయపడుతూనే ఉన్నారు. థియేటర్స్‌కి ప్రేక్షకులు భయం లేకుండా రావాలంటే.. కరోనాకి వ్యాక్సిన్ రావాల్సిందే. ఇక ఇదే అదనుగా చూసుకుని ఓటీటీ సంస్థలు రాజ్యమేలుతున్నాయి. అయితే వారు అందించే కంటెంట్ లెస్ సినిమాలపై జనాలు కూడా ఇంట్రస్ట్ పెట్టడం లేదు. అలాంటి తరుణంలో.. అందిరిచేత శభాష్ అనిపించుకునేలా వచ్చింది సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం. ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదలైన ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రంపై ప్రేక్షకులు, సెలబ్రిటీలు, విమర్శకులు.. ఇలా ప్రతి ఒక్కరూ.. ఈ సినిమాను, సినిమాలో నటించిన వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.


‘‘సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని నా ఫ్రెండ్స్‌తో కలిసి చూశారు. అందులో ముగ్గురు సినిమా చూసి ఏడుస్తూనే ఉన్నారు. బాగా ఎమోషనల్ అయ్యారు. బయటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్ అస్సలు నమ్మకూడదు. ఈ సినిమా చూశాక ఆవేశం వచ్చేసింది. సూర్య అన్న అద్భుతమైన నటుడు. ఆయన నటనను చూసి అందరూ ప్రేమలో పడిపోతారు. ఈ సినిమాని ఆయన నిర్మించినందుకు లవ్ యు సార్. హీరోయిన్‌గా ఆపర్ణను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో గానీ.. అద్భుతం. ఇలాంటి వారిని సుధగారు భలే పట్టుకొస్తుంటారు. వాస్తవంగా.. నటనతో ఆమె కట్టిపడేసింది. సుధాకొంగర.. ఖచ్చితంగా త్వరలో ఆమెతో కలిసి సినిమా చేస్తాను. ఇది ఆమె పట్ల నాకున్న గౌరవం. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇతర నటీనటులు అందరూ చాలా గొప్పగా చేశారు. ఈ సినిమాలో నిజం, కల్పితం అనేవి ఎంత ఉన్నాయో నాకు తెలియదు.. అందుకే కెప్టెన్ జర్నీ గురించి మరింత తెలుసుకోవడానికి సింప్లీ ఫ్లై బుక్‌ని ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నాను. పరేష్ గోస్వామి వంటి వారిని పక్కన పెట్టేసి.. ఈ సినిమాని అందరూ ఖచ్చితంగా చూడండి.. ఛీర్స్..’’ అని విజయ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  

Updated Date - 2020-11-17T02:52:08+05:30 IST