‘రంగ్ దే’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

ABN , First Publish Date - 2020-11-13T00:53:27+05:30 IST

యూత్ స్టార్ నితిన్, మహానటి కీర్తి సురేష్‌ నటిస్తున్న 'రంగ్‌ దే' చిత్రం నుంచి రొమాంటిక్ మెలోడీ గీతాన్ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఈ సాంగ్‌ ఎప్పుడో

‘రంగ్ దే’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

యూత్ స్టార్ నితిన్, మహానటి కీర్తి సురేష్‌ నటిస్తున్న 'రంగ్‌ దే' చిత్రం నుంచి రొమాంటిక్ మెలోడీ గీతాన్ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఈ సాంగ్‌ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర సమర్పకుడు పి.డి.వి.ప్రసాద్ భార్య మృతి చెందడంతో సాంగ్‌ విడుదలను వాయిదా వేసి.. ఈరోజు(గురువారం) విడుదల చేశారు. నితిన్ పెళ్లిని పురస్కరించుకుని చిత్రయూనిట్‌ ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్‌ వచ్చినప్పటి నుంచి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది.


‘ఏమిటో ఇది వివరించలేనిది

మది ఆగమన్నది తనువాగనన్నది

భాష లేని ఊసులాట సాగుతున్నది

అందుకే ఈ మౌనమే ఓ భాష ఐనది

కోరుకోని కోరికేదో తీరుతున్నది‘ అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ గాత్రంలో ఈ రొమాంటిక్‌ గీతం వినసొంపుగా ఉంది. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు అందించారు. ఇక ఈ చిత్ర షూటింగ్‌ విషయానికి వస్తే.. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.Updated Date - 2020-11-13T00:53:27+05:30 IST