విజయ్.. నిన్ను చూసి గర్వపడుతున్నా: రితూ వర్మ
ABN , First Publish Date - 2020-05-09T20:39:49+05:30 IST
`పెళ్లి చూపులు` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఆ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రితూ వర్మ.

`పెళ్లి చూపులు` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు ఆ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రితూ వర్మ. ఆ తర్వాత `అర్జున్‌రెడ్డి`తో విజయ్ దేవరకొండ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక, రితూ వర్మ తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.
ఈ రోజు (శనివారం) విజయ్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా విజయ్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది రితూవర్మ. `హ్యాపీ బర్త్‌డే విజయ్. `పెళ్లి చూపులు` సినిమాకు నిర్మాతను వెతకడం దగ్గర్నుంచి.. స్టార్ హీరోగా ఎదగడం.. సొంతంగా సినిమాలు నిర్మించడం వరకు.. నువ్వు చాలా దూరం ప్రయాణించావు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. నువ్వు ఇలాగే మరింత ఎదగాలని కోరుకుంటున్నా` అంటూ రితూ వర్మ కామెంట్ చేసింది. విజయ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.