జెనీలియా భర్త ఇగోను హర్ట్ చేసిన క్రికెటర్లు!

ABN , First Publish Date - 2020-10-21T22:47:39+05:30 IST

దక్షిణాదిన పలు భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ జెనీలియా.

జెనీలియా భర్త ఇగోను హర్ట్ చేసిన క్రికెటర్లు!

దక్షిణాదిన పలు భాషల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసి అక్కడి హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను వివావాం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న జెనీలియా తాజాగా తన భర్తతో కలిసి `ది కపిల్‌ శర్మ కామెడీ షో`కు హాజరైంది. ఆ కార్యక్రమంలో రితేష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 


`గతంలో ఒకసారి బెంగుళూరులో క్రికెట్‌ మ్యాచ్ చూడటానికి వెళ్లాను. అక్కడ ఇద్దరు క్రికెటర్లు నన్ను చూసి.. `మీరు జెనీలియా భర్త కదా` అని అడిగారు.  ఆ మాటకు నా ఇగో కొంచెం హర్ట్ అయింది. `ఇక్కడ నేను జెనీలియా భర్తనే.. కానీ, మహారాష్ట్రలో ఆమె రితేష్‌ భార్య`అని చెప్పాను. దానికి వారు.. `మహారాష్ట్రలోనే ఆమెను రితేష్‌ భార్య అంటారు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు` అని సమాధానం ఇచ్చార`ని రితేష్‌ తెలిపారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు. 

Updated Date - 2020-10-21T22:47:39+05:30 IST