నిషికాంత్ కామ‌త్ బ్రతికే ఉన్నారు: రితేష్, జాన్ అబ్రహం

ABN , First Publish Date - 2020-08-17T22:00:22+05:30 IST

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూసినట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొన్న విషయం

నిషికాంత్ కామ‌త్ బ్రతికే ఉన్నారు: రితేష్, జాన్ అబ్రహం

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు నిషికాంత్ కామత్ అనారోగ్యంతో సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ఏఐజీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూసినట్లుగా బాలీవుడ్ మీడియా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని బాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్స్ చేస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా నిషికాంత్ కామత్ లివ‌ర్ సిరోసిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య తిర‌గ‌బెట్ట‌డంతో జూలై 31 నుంచి ఆయన ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప‌రిస్థితి చేయిదాటడంతో ఆయ‌న తుది శ్వాస విడిచారనే వార్త సోమవారం ఉదయం బాలీవుడ్ మీడియా ప్రచారం చేసింది.


అయితే ఆయన చనిపోలేదని, వెంటిలేటర్‌పై చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన కోలుకోవాలని అందరూ ప్రార్థనలు చేద్దాం.. అని బాలీవుడ్ హీరోలు జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్ ట్వీట్స్ చేశారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా మ‌ల‌యాళ చిత్రం దృశ్యంను హిందీలో రీమేక్ చేశారు నిషికాంత్ కామ‌త్‌. అంతకు ముందు ఆయ‌న మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

Updated Date - 2020-08-17T22:00:22+05:30 IST