రణబీర్‌కు కరోనా... రూమర్స్‌ను ఖండించిన రిద్ది

ABN , First Publish Date - 2020-07-12T17:41:08+05:30 IST

బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఆయ‌న త‌ల్లి నీతూ క‌పూర్‌కి కరోనా సోకిందంటూ వార్త‌లు పుట్టాయి. ఈ వార్త‌ల‌ను నీతూ క‌పూర్ కుమార్తె రిద్ది ఖండించారు.

రణబీర్‌కు కరోనా... రూమర్స్‌ను ఖండించిన రిద్ది

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌కు, ఆయ‌న త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ క‌రోనా బారిన ప‌డి హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. అమితాబ్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందా బ‌ర్త్ డే వేడుక‌ల‌కు హాజ‌రైన క్ర‌మంలో బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్‌, ఆయ‌న త‌ల్లి నీతూ క‌పూర్‌కి కరోనా సోకిందంటూ వార్త‌లు పుట్టాయి. ఈ వార్త‌ల‌ను నీతూ క‌పూర్ కుమార్తె రిద్ది ఖండించారు. ‘‘గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించ‌కండి. క్లారిటీ తీసుకుని మాట్లాడండి. త‌మ్ముడికి, అమ్మ‌కి క‌రోనా సోకిందంటూ చేస్తున్న ప్ర‌చారాన్ని ఆపండి. మేం ఫిట్‌గా ఉన్నాం’’ అంటూ గాసిప్ రాయుళ్ల‌పై రిద్ది ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. 

Updated Date - 2020-07-12T17:41:08+05:30 IST