రిషీ కపూర్ ఉత్తర క్రియలో పాల్లొన్న కూతురు రిద్ధిమ

ABN , First Publish Date - 2020-05-04T07:03:27+05:30 IST

రిషీ కపూర్‌ సతీమణి నీతూ కపూర్‌, తనయుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఆదివారం స్వగృహంలో రిషీ ఉత్తర క్రియలు నిర్వహించినట్టు ముంబయ్‌ ఖబర్‌...

రిషీ కపూర్ ఉత్తర క్రియలో పాల్లొన్న కూతురు రిద్ధిమ

రిషీ కపూర్‌ సతీమణి నీతూ కపూర్‌, తనయుడు రణ్‌బీర్‌ కపూర్‌ ఆదివారం స్వగృహంలో రిషీ ఉత్తర క్రియలు నిర్వహించినట్టు ముంబయ్‌ ఖబర్‌. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన రిషీ కుమార్తె రిద్ధిమా కపూర్‌ సహానీ సహా ఈ కార్యక్రమాలకు కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో శ్రేయోభిలాషులు హాజరైనట్టు సమాచారం. కుమార్తె సమరతో ఢిల్లీ నుండి శనివారం రాత్రి రిద్ధిమ ముంబయ్‌ చేరుకున్నారట. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఉండాలని అనుమతులు తీసుకుని మరీ పుట్టింటికి వచ్చారట. రిషీ ఫొటో పక్కన నీతు, టర్బన్‌ ధరించిన రణ్‌బీర్‌ కూర్చున్న ఫొటో ఇంటర్‌నెట్‌లో ఆదివారం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయింది.

Updated Date - 2020-05-04T07:03:27+05:30 IST