నా దగ్గర ఉన్న సుశాంత్ ఆస్తి అదే: రియా చక్రవర్తి
ABN , First Publish Date - 2020-08-08T22:06:15+05:30 IST
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని హీరోయిన్ రియా చక్రవర్తి తెలిపింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని హీరోయిన్ రియా చక్రవర్తి తెలిపింది. రియా నోట్‌బుక్‌లో సుశాంత్ గతంలో రాసిన `నోట్ ఆఫ్ గ్రాటిట్యూడ్` (కృతజ్ఞతల జాబితా) పేజీని రియా లాయర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో తన జీవితానికి, రియా కుటుంబ సభ్యులకు సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.
ఆ నోట్ ప్రకారం లిల్లు, బెబు, సర్, మేడమ్, ఫుడ్జ్ మొదలైన వారికి సుశాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ పేర్ల గురించి రియా స్పష్టత ఇస్తూ.. `లిల్లు అంటే షోవిక్ (రియా సోదరుడు), బేబో అంటే నేను, సర్ అంటే మా నాన్న, మేడమ్ అంటే మా అమ్మ` అని పేర్కొంది. అలాగే `చిచ్చోరే` అని రాసి ఉన్న సుశాంత్‌కు సంబంధించిన బాటిల్ ఫొటోను కూడా షేర్ చేశారు. ఇవి, తప్ప సుశాంత్‌కు సంబంధించిన ప్రాపర్టీ ఏదీ తన వద్ద లేదని రియా తెలిపింది.