ఆ తెలుగు సినిమాకు ఝలక్ ఇచ్చిన సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా! ‌

ABN , First Publish Date - 2020-08-05T11:38:18+05:30 IST

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అనంత‌రం అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి వార్తల్లో నిలిచారు. రియాపై సుశాంత్ తండ్రి కెకె సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించింది...

ఆ తెలుగు సినిమాకు ఝలక్ ఇచ్చిన సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా! ‌

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అనంత‌రం అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి వార్తల్లో నిలిచారు. రియాపై సుశాంత్ తండ్రి కెకె సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించింది రియానేన‌ని కెకె సింగ్ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ నేప‌ధ్యంలో ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన ప‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 2012 లో తెలుగు సినిమా తూనీగ, తూనీగతో కెరీర్ ప్రారంభించిన రియా,  2019 లో మ‌రో తెలుగు చిత్రం సూపర్ మ‌చ్చికి సైన్ చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతలు రియాతో ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. అలాగే రియా, కళ్యాణ్‌ల‌తో కూడిన ఒక‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు, అయితే ఆ త‌రువాత ఎటువంటి కార‌ణం లేకుండా రియా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ని తెలుస్తోంది. ఆ త‌రువాత ఈ చిత్ర దర్శకుడు పులి వాసు కన్నడ నటి రచిత రామ్‌ను ఈ చిత్రంలో ప్రధాన నటిగా తీసుకున్నారు. త‌రువాత కొన్ని సన్నివేశాలను రచిత, కళ్యాణ్ దేవ్‌ల‌పై చిత్రీకరించారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని స్వరపరిచారు. 

Updated Date - 2020-08-05T11:38:18+05:30 IST