రియా చక్రవర్తి హంతకి, విషకన్య...జేడీయూ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-31T17:04:12+05:30 IST

దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నిందితురాలైన సినీనటి రియా చక్రవర్తిపై జేడీయూ నేత మహేశ్వర్ హజారీ సంచలన ఆరోపణలు చేశారు.....

రియా చక్రవర్తి హంతకి, విషకన్య...జేడీయూ నాయకుడి సంచలన వ్యాఖ్యలు

పట్నా (బీహార్): దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నిందితురాలైన సినీనటి రియా చక్రవర్తిపై జేడీయూ నేత మహేశ్వర్ హజారీ సంచలన ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటుడైన సుశాంత్ జూన్ 14వతేదీన ముంబైలోని బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రియురాలైన రియా చక్రవర్తి కాంట్రాక్టు హంతకి, విషకన్య అని సుశాంత్ ను మోసగించిందని జేడీయూ నేత విమర్శించారు. సుశాంత్ ది హత్య అని, దీని వెనుక ఓ పెద్ద ముఠా హస్తం ఉందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మహేశ్వర్ డిమాండ్ చేశారు. రియా చక్రవర్తి ప్రేమ పేరిట సుశాంత్ ను మోసగించి డబ్బు తీసుకొని పోయిందని మహేశ్వర్ ఆరోపించారు. ఒక పథకం ప్రకారం సుశాంత్ ను రియా చక్రవర్తి చంపిందని, ఆమె విషకన్య అని హజారీ చెప్పారు. సుశాంత్ కేసులో ముంబై పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, అదువల్ల ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-31T17:04:12+05:30 IST