నిర్భయ కేసుపై వర్మ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-02-02T00:54:50+05:30 IST

నిర్భయ దోషుల ఉరిని మరోసారి వాయిదా వేయడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నిర్భయ జంతువుల

నిర్భయ కేసుపై వర్మ సంచలన వ్యాఖ్యలు

నిర్భయ దోషుల ఉరిని మరోసారి వాయిదా వేయడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైతే.. నేడు మన సిస్టమ్ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోందంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.


‘‘నాడు నిర్భయ జంతువుల చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురైంది. నేడు మన సిస్టమ్ చేతిలో గ్యాంగ్ రేప్‌నకు గురవుతోంది. నిర్భయ తల్లిదండ్రుల ఫీలింగ్స్‌ని మీరు ఊహించగలరా మోదీ గారూ. దానిని తెలుసుకోవడం కోసం.. నిర్భయను చంపేసిన నిందితులను శిక్షించేందుకు మన కోర్టులన్నీ ఎలా కింద మీదా పడుతున్నాయో చూడండి’’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Updated Date - 2020-02-02T00:54:50+05:30 IST