వ‌ర్మ మ‌రో సంచ‌లనం.. సీనియ‌ర్ జ‌ర‌్నలిస్ట్ అర్నాబ్‌పై సినిమా

ABN , First Publish Date - 2020-08-04T19:14:20+05:30 IST

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అర్నాబ్ గోస్వామి బాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. బాలీవుడ్‌లో దివ్య‌భార‌తి, జియాఖాన్‌, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్

వ‌ర్మ మ‌రో సంచ‌లనం.. సీనియ‌ర్ జ‌ర‌్నలిస్ట్ అర్నాబ్‌పై సినిమా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య బాలీవుడ్‌లో పెనుదుమారాన్నే రేపుతుంది. ఓ వైపు నెపోటిజంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రో వైపు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. హ‌త్య అని కంగ‌నాలాంటి వ్య‌క్తులు వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అర్నాబ్ గోస్వామి బాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. బాలీవుడ్‌లో దివ్య‌భార‌తి, జియాఖాన్‌, శ్రీదేవి, ఇప్పుడు సుశాంత్ మ‌ర‌ణంపై బాలీవుడ్ స‌మాధానం చెప్పాల‌ని, బాలీవుడ్ ఒక డ‌ర్టీ అని ఆయ‌న అన్నారు. అర్నాబ్ వ్యాఖ్యల‌పై ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అర్నాబ్‌పై ట్వీట్స్‌తో విరుచుకుప‌డ్డారు ఆర్జీవీ. బాలీవుడ్‌పై అర్నాబ్ వ్యాఖ్య‌లు చూసి తాను షాక‌య్యాన‌ని వ‌ర్మ తెలిపారు. 


రేపిస్ట్స్‌, గ్యాంగ్‌స్ట‌ర్స్ మాత్ర‌మే ఉన్న‌ట్లు మాట్లాడుతున్నాడని, పాతికేళ్ల కాలంలో జ‌రిగిన నాలుగు మ‌ర‌ణాల‌ను ఒక తాటిపై తెచ్చి అర్నాబ్ మాట్లాడుతున్నాడని వ‌ర్మ అన్నారు. ఈ నాలుగు ఆత్మ‌హ‌త్య‌లు వేర్వేరు సంద‌ర్భాల్లో, ప‌రిస్థితుల్లో జ‌రిగాయి. కానీ అర్నాబ్ అన్నింటికీ బాలీవుడ్ ప‌రిశ్ర‌మే కార‌ణ‌మన్న‌ట్లు మాట్లాడుతున్నారని అర్నాబ్‌ను ఉద్దేశించి వ‌ర్మ విమ‌ర్శ‌లు చేశారు. ఆదిత్య చోప్రా, క‌ర‌ణ్ జోహార్‌, మ‌హేశ్ భ‌ట్‌, షారూక్ ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ మీరంతా ఏం చేస్తున్నారు? అర్నాబ్ మొరుగుతుంటే.. మీరు ఆఫీస్ టేబుల్స్ కింద దాక్కున్నారా?  మీరు అత‌నికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టానికి భ‌య‌ప‌డుతున్నారు అని బాలీవుడ్ పెద్ద‌ల‌ను ఉద్దేశించి వ‌ర్మ ప్ర‌శ్నించారు. నేను అర్నాబ్‌పై ఓ సినిమాను చేయాల‌నుకుంటున్నాను. అత‌ని అస‌లు రంగును బ‌య‌పెడ‌తాను. నా సినిమా పేరు ‘అర్నాబ్‌.. ది న్యూస్‌ ప్రాస్టిట్యూట్’ అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తన సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాఫియా, టెర్ర‌రిజం, ఫ్యాక్ష‌నిస్టుల‌పై సినిమాలు చేసిన వ‌ర్మ తొలిసారి ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌కు వ్య‌తిరేకంగా సినిమా చేస్తున్నారు. మ‌రి ఆర్జీవీపై అర్నాజ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 

Updated Date - 2020-08-04T19:14:20+05:30 IST