ఆర్జీవీ-మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ టీజర్ రిలీజ్

ABN , First Publish Date - 2020-05-14T23:51:49+05:30 IST

మియా మాల్కోవా- ఆర్జీవీ.. ఈ కాంబినేషన్ అంటేనే ఆ సినిమా ఓ సెన్సేషన్. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ...

ఆర్జీవీ-మియా మాల్కోవా ‘క్లైమాక్స్’ టీజర్ రిలీజ్

ముంబై: మియా మాల్కోవా- ఆర్జీవీ.. ఈ కాంబినేషన్ అంటేనే ఆ సినిమా ఓ సెన్సేషన్. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ఓ న్యూడ్ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆర్జీవీకి అనేక చిక్కులూ తెచ్చిపెట్టింది. అయినప్పటికీ మరోసారి మియాతో సినిమా తీసేందుకు ఆర్జీవీ సిద్ధమయ్యాడు. ‘క్లైమాక్స్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ ఈ రోజు తన ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. ఎడారిలో సాగే యాక్షన్, థ్రిల్లర్ సన్నివేశాల మేళవింపుతో ఈ టీజర్ ఉందని ఆర్జీవీ రాసుకొచ్చాడు. ఇదిలా ఉంటే ‘ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో మియా-ఆర్జీవీల తరపున ప్రజలకు అందిస్తున్న గిఫ్ట్ ఇది’ అనే టైటిల్స్‌తో టీజర్ మొదలవుతుంది.
Updated Date - 2020-05-14T23:51:49+05:30 IST