'డేంజరస్' బ్యూటీస్‌తో ఆర్జీవీ
ABN , First Publish Date - 2020-10-12T17:20:09+05:30 IST
ఆర్జీవీ దర్శకత్వంలో బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ 'డేంజరస్'.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన సారథ్యంలో `బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న మూవీ 'డేంజరస్'. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేస్తూ గోవాలో డేంజరస్ గర్ల్స్‌తో సినిమా షూటింగ్ పూర్తయ్యిందని తెలిపాడు. ఇది ఇండియాలోనే తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అని, ఈ లెస్బియన్స్ ఎఫైర్ చాలా మందిని చంపేసిందని... వారిలో పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్ కూడా ఉన్నారని పోస్టర్‌పై వర్మ తెలిపాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ అక్కడ బీచ్‌లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరి క్లీన్ చేయాలని, కంగనా.. అర్నాబ్ కంటే మీరే డేంజరస్ అంటూ తమదైన శైళిలో వర్మపై కామెంట్స్ విసిరారు.