ఆర్జీవీ బయోపిక్ 'రాము' షూటింగ్ స్టార్ట్

ABN , First Publish Date - 2020-09-16T17:08:46+05:30 IST

బుధవారం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన 'రాము' షూటింగ్ కు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఆర్జీవీ బయోపిక్ 'రాము' షూటింగ్ స్టార్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్‌ 'రాము' షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బయోపిక్‌ను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన 'రాము' షూటింగ్ కు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆర్జీవీ సోదరి విజయ క్లాప్ ఇచ్చారు. ఈ మూడు భాగాల బయోపిక్‌ను బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి భాగంలో  దొరసాయి తేజ టీనేజ్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ పార్ట్ 1లో వర్మ కాలేజ్  రోజులు, తోలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడన్నది కథాంశంగా చూపించబోతున్నారు. మిగతా పాత్రల్లో కొత్త నటీనటులు నటిస్తున్నారు.
Updated Date - 2020-09-16T17:08:46+05:30 IST