ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘ప‌వ‌ర్‌స్టార్’... ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఏంటో?

ABN , First Publish Date - 2020-06-28T18:23:54+05:30 IST

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో బిజీగా ఉన్నారు. ఆర్జీవీ త‌న ఆర్జీవీ వ‌రల్డ్ థియేట‌ర్‌లో సినిమాల‌ను వ‌రుస‌గా విడుద‌ల చేస్తున్నారు.

ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘ప‌వ‌ర్‌స్టార్’... ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఏంటో?

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని కూడా త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో బిజీగా ఉన్నారు. ఆర్జీవీ త‌న ఆర్జీవీ వ‌రల్డ్ థియేట‌ర్‌లో సినిమాల‌ను వ‌రుస‌గా విడుద‌ల చేస్తున్నారు. పే ఫ‌ర్ వ్యూ లెక్క‌న ప్రేక్ష‌కుల నుండి వ‌సూలు చేస్తున్నారు. ‘క్లైమాక్స్‌’ సినిమాకు రూపాయ‌లు, ‘న‌గ్నం’ చిత్రానికి రెండు వంద‌ల రూపాయ‌ల పే ఫ‌ర్ వ్యూ వ‌సూలు చేశాడు. లేటెస్ట్‌గా తాను ‘ప‌వ‌ర్‌స్టార్‌’అనే సినిమాను చేయ‌బోతునట్లు  అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో పీకే, ఎంఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, న‌లుగురు పిల్ల‌లున్న‌ర‌ష్య‌న్ లేడీ, ఆర్జీవీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అలాగే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ త‌ర‌హాలో డ్రెస్ వేసుకున్న ఓ న‌టుడి వీడియో ట్విట్టర్‌లో విడుద‌ల చేసి ‘‘ఇత‌నే నా ‘ప‌వ‌ర్‌స్టార్‌’ సినిమాలో నటించబోయేది. తను నా ఆఫీస్‌కి వ‌చ్చిన‌ప్పుడు ఈ షాట్‌ను చిత్రీక‌రించాను. ఇత‌న్ని ఎక్క‌డో చూసిన‌ట్లు అనిపిస్తే అది యాదృచ్చిక‌మే’’ అని ట్వీట్ చేశారు. మ‌రి వ‌ర్మ చేస్తున్న కొత్త సినిమాపై ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  Updated Date - 2020-06-28T18:23:54+05:30 IST