ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘అల్లు’

ABN , First Publish Date - 2020-08-02T16:48:36+05:30 IST

త‌న త‌దుప‌రి చిత్రం ‘అల్లు’ అని ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు ఆర్జీవీ

ఆర్జీవీ నెక్ట్స్ మూవీ ‘అల్లు’

వివాదాల‌కు కేరాఫ్ అయిన ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా‘ప‌వ‌ర్‌స్టార్‌’ అనే సినిమా తీసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో కాంట్ర‌వ‌ర్సీ మూవీకి వ‌ర్మ తెర తీశాడు. త‌న త‌దుప‌రి చిత్రం ‘అల్లు’ అని ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు ఆర్జీవీ. ‘‘తనకి మంచి జరగాలి అంటే ప్లాన్ అల్లు, మరొకడికి చెడు జరగాలి అంటే ప్లాన్ అల్లు అనే స్ట్రాటర్జీ తో ప్లాన్‌ల అల్లుడులో ఆరితేరిపోయి, పెద్ద స్టార్ అయిన తన బావ  పక్కనే ఉంటూ తన మైలేజీ పడిపోకుండా ఉండటానికి తమ ఇంటి “అల్లు”డు అని కూడా మర్చిపోయి ఎప్పటికప్పుడు ప్లాన్లు అల్లుతూ వుంటాడు. అందరితో తనని ‘ఆహా’ అనిపించుకోవటానికి తనకి కావాల్సిన వాళ్ళకే  మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే  ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ ‘అల్లు’’’ అంటూ  వ‌ర్మ తెలిపారు. ఈ చిత్రంలో ఆర‌వింద్‌, చిర్రంజీవి, ప్ర‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆర్జున్‌, శీరీష్‌, కె.ఆర్‌.చ‌ర‌ణ్‌, ఎన్‌.బీబు త‌దిత‌ర పాత్ర‌లుంటాయ‌ని కూడా వ‌ర్మ తెలిపారు. 


చిరంజీవి బావ మ‌రిది అయిన అల్లు అర‌వింద్‌ను ఆర్జీవీ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. కానీ వ‌ర్మ ఈసారి కూడా తెలివిగా నేరుగా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. మ‌రి ఈ సినిమా ఎన్ని వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతుందో చూడాలి. 


Updated Date - 2020-08-02T16:48:36+05:30 IST