`మర్డర్` సినిమా మారుతీరావుకి సంబంధించింది కాదు: వర్మ

ABN , First Publish Date - 2020-12-21T18:43:40+05:30 IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం `మర్డర్`.

`మర్డర్` సినిమా మారుతీరావుకి సంబంధించింది కాదు: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం `మర్డర్`. మిర్యాలగుడాలో వివాదాస్పదమైన ప్రణయ్-అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా వివాదాస్పదమైంది. అమృత కుటుంబ సభ్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కేసును విచారించిన కోర్టు విడుదలకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గరపుడుతున్న నేపథ్యంలో వర్మ తాజాగా స్పందించారు. 


`మర్డర్` అనేది మారుతీరావు, అమృతకు సంబంధించిన కథ కాదని, అలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వర్మ తాజాగా పేర్కొన్నారు. రేపు (మంగళవారం) మిర్యాలగూడ నటరాజ్ థియేటర్ ఎదుట రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడతామని వర్మ తెలిపారు. అక్కడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామన్నది అప్పుడే చెబుతానన్నారు. ఈ నెల 24న సినిమా రిలీజ్ అవుతోంది.Updated Date - 2020-12-21T18:43:40+05:30 IST