అవును.. ఇదంతా `ఆస్కార్` శాపమే: రసూల్
ABN , First Publish Date - 2020-07-27T22:06:42+05:30 IST
బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రాకపోవడం గురించి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే

బాలీవుడ్‌లో తనకు అవకాశాలు రాకపోవడం గురించి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెహ్మాన్ వ్యాఖ్యలకు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కపూర్ స్పందిస్తూ.. `రెహ్మాన్.. నీకు నీ సమస్య తెలుసు. ఆస్కార్ గెలవడం అంటే బాలీవుడ్‌లో చావుకు ముద్దు పెట్టడం లాంటిది. బాలీవుడ్ హ్యాండిల్ చేసేదాని కంటే నువ్వు ఎక్కువ టాలెంట్ కలిగి ఉన్నావని దాని అర్థం` అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి స్పందించారు.
రెహ్మాన్‌తోపాటు `స్లమ్‌డాగ్ మిలీనియర్` సినిమాకు ఆస్కార్ అందుకున్న రసూల్‌కు కూడా ఆ తర్వాత అవకాశాలు రాలేదట. ఆ విషయాన్ని ఆయన తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. `డియర్ శేఖర్ కపూర్.. దాని గురించి నన్ను అడగండి. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత నాకు బాలీవుడ్ నుంచి అవకాశాలు రాలేదు. `నువ్వు మాకు అవసరం లేద`ని కొందరు నిర్మాతలు నా మొహం మీదే చెప్పారు. అయినా ఇప్పటికీ నేను బాలీవుడ్‌ను ప్రేమిస్తూనే ఉన్నాన`ని ట్వీట్ చేశారు.
Read more