నేను ఇరుక్కుపోయాను.. రేణు దేశాయ్ కవిత వైరల్
ABN , First Publish Date - 2020-10-25T03:54:58+05:30 IST
నటి రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటో.. ఆ ఫొటోకి ఆమె రాసిన తెలుగు మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

నటి రేణు దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేసిన ఫొటో.. ఆ ఫొటోకి ఆమె రాసిన తెలుగు మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏముంది అంతలా వైరల్ అవడానికి అనుకుంటున్నారేమో.. చాలా మ్యాటర్ ఉంది ఇందులో. ఆమె తెలుగులో ఓ కవిత్వం రాసేశారు. రేణుదేశాయ్ కవితలు, కథలు రాస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పోస్ట్‌లో ఆమె ఎంతో అందంగా ముస్తాబైన బ్లాక్ అండ్ వైట్ ఫొటో పెట్టి.. ఇంగ్లీష్‌లో ఓ కవితను రాసి.. దానికి తెలుగు అనువాదం కూడా ఆమె ఇక్కడ పోస్ట్ చేయడం విశేషం.
ఆ తెలుగు అనువాదం ఎలా ఉందో మీరూ ఓ లుక్ వేయండి..
''మస్క మస్క ఛాయలోల,
అవుక్క అవుక్క న్నడలోల,
న్న త్లపుల స్వలగూళిలో,
నేను ఇరుక్కుపోయాను
న్న స్పరశ, ఆ గురుు !!
ఓ కాటుక చారిక,
నా అశ్రువును ఆపుతోంది ఆమైమరుపులోల నాఉనిక్తనితీరిచదిద్దాతోంది
ఒక చిరునవుా నా పెదవంచులోల ఊయలలూగుతోంది
ఇది నా అంచనాలూ,
నా జ్ఞా ప్కాలూ కల్నసి ప్ల్నక్తన ఓ మహోనాత్ గ్ంధరా నాదస్మేయళనం" అని రేణు దేశాయ్ తను రాసిని ఇంగ్లీష్ కవితకు తెలుగు రాశారు. కాగా, ప్రస్తుతం ఆమె 'ఆద్య' అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Read more