హైదరాబాద్ వాతావరణంతో రేణు దేశాయ్ షాక్.. ఫొటో వైరల్
ABN , First Publish Date - 2020-09-18T03:12:19+05:30 IST
హైదరాబాద్ వాతావరణంపై రేణు దేశాయ్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం

హైదరాబాద్ వాతావరణంపై రేణు దేశాయ్ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మబ్బులు పట్టి భీభత్సంగా వర్షం కురుస్తోంది. అయితే రేణు దేశాయ్ బుధవారం సాయంత్రం హైదరాబాద్ వాతావరణానికి సంబంధించి ఒక ఫొటో తనే స్వయంగా తీశారంట. ఆ ఫొటోని తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. తన 39 సంవత్సరాల వయసులో ఏనాడూ ఇలాంటి వాతావరణం చూడలేదని పేర్కొంది. మాములుగా లేడీస్ తమ వయసు చెప్పడానికి ఇష్టపడరు. కానీ ఈ పోస్ట్‌లో రేణు దేశాయ్ తన వయసుని కూడా చెప్పేసింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది.
ఇక రేణు పోస్ట్ చేసిన ఫొటో నిజంగానే అద్భుతంగా ఉంది... ''ఇది బ్లాక్ అండ్ వైట్ ఫొటో కాదు.. నిన్న సాయంత్రం క్లిక్ చేసిన కలర్ ఫొటో ఇది. నా ఈ 39 ఏళ్ళలో నిన్న సాయంత్రం చూసిన వాతావరణ టోన్‌ను నేను ఇంత వరకు ఎప్పుడూ చూడలేదు. ఆకాశం ఎంతో వాస్తవికమైనదిగా.. సినిమాలో చూపించినట్టుగానే అనిపించింది. ఈ ఫొటోని సాయంత్రం 6 గంటలకు తీయడం జరిగింది. దీనిని ఎలాంటి ఎడిట్ చేయలేదు. ఆకాశం తనను తానే అందంగా ముస్తాబు చేసుకుంది.." అని తెలపుతూ ఈ పిక్‌ని తన ఐఫోన్ నుంచి తీసినట్లుగా పేర్కొంది రేణు దేశాయ్.