ఇంత ద్వేషం ఎందుకన్నా: రేణూదేశాయ్

ABN , First Publish Date - 2020-04-20T20:19:44+05:30 IST

`బద్రి` విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రం షూటింగ్ అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రేణూదేశాయ్

ఇంత ద్వేషం ఎందుకన్నా: రేణూదేశాయ్

`బద్రి` విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్రం షూటింగ్ అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు రేణూదేశాయ్. తన తొలి సినిమా గురించి, ఆ సినిమా షూటింగ్ సందర్భంగా పవన్‌తో మాట్లాడిన మాటల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు చేశారు. ఈ సమయంలో ఓ నెటిజన్ రేణును ఉద్దేశిస్తూ ఓ కామెంట్ చేశాడు. దానికి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 


`ఈ రేణూదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు. ఆ మధ్య చాలా చేసింది. మళ్లీ ఈ పోస్టులు ఎందుకు? ఎంగేజ్‌మెంట్ అయింది కదా.. ఆ విషయం ఏమైంది` అంటూ కామెంట్ చేశాడు. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసిన రేణు.. `నాకు ఇప్పుడే ఈ మెసేజ్ వచ్చింది. అవసరమా?.. అవును.. అవసరమే. `బద్రి` వచ్చి 20 ఏళ్లు. చాలా మంది మర్చిపోయుంటారు. ఇది నా మొదటి సినిమా. కాబట్టి నాకు చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకన్నా? ప్రస్తుతం మనమందరం ఓ సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు అందరి కోసం మంచి ఆలోచనలు చేయండి. ఇంత కోపం మీ ఆరోగ్యానికి మంచిది కాద`ని రిప్లై ఇచ్చారు.  

Updated Date - 2020-04-20T20:19:44+05:30 IST