శీతాకాలం గుర్తుందా?

ABN , First Publish Date - 2020-08-25T05:28:57+05:30 IST

శీతాకాలం ప్రతి ఏడాదీ వస్తుంది. మరి, అది గుర్తుండటం ఏమిటి? అంటే... మర్చిపోలేని సంఘటన ఏదో జరిగి ఉండాలి. సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించనున్న చిత్రంలో...

శీతాకాలం గుర్తుందా?

శీతాకాలం ప్రతి ఏడాదీ వస్తుంది. మరి, అది గుర్తుండటం ఏమిటి? అంటే... మర్చిపోలేని సంఘటన ఏదో జరిగి ఉండాలి. సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించనున్న చిత్రంలో ప్రేమకథ ఓ శీతాకాలంలోనే మొదలుకానుంది. అందుకని, చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి నాగశేఖర్‌ దర్శక-నిర్మాత. భావనా రవి మరో నిర్మాత. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడు. ఇది కన్నడ హిట్‌ ‘లవ్‌ మాక్‌టైల్‌’కి రీమేక్‌. బహుశా... అందువల్లనే ఏమో? తెలుగు వెర్షన్‌ ఆడియో రైట్స్‌ మంచి రేటు పలికాయి. నాగశేఖర్‌ మాట్లాడుతూ ‘‘చాలామంది ప్రేమకథలు శీతాకాలంలో మొదలవుతాయి. అందుకని, టైటిల్‌ విన్నవారంతా తమ ప్రేమకథ గుర్తు చేసుకుంటున్నారు. కవితాత్మకంగా ఉందని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కన్నడ కంపెనీ ఆనంద్‌ ఆడియో రూ. 75 లక్షలకు పాటల హక్కులను సొంతం చేసుకుంది. ఇది మా తొలి విజయం, రికార్డు అని చెప్పాలి. అతి త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యా హెగ్డే.

Updated Date - 2020-08-25T05:28:57+05:30 IST