పాయల్‌కు జాతీయ మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ సపోర్ట్‌

ABN , First Publish Date - 2020-09-20T20:06:48+05:30 IST

రేఖా శర్మ ట్విట్టర్‌ వేదికగా పాయల్‌కు రిప్లయ్‌ ఇచ్చారు.

పాయల్‌కు జాతీయ మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ సపోర్ట్‌

చాలా రోజుల క్రితం కాస్టింగ్‌ కౌచ్‌ను రూపుమాపాలంటూ మొదలైన మీ టూ ఉద్యమం సినీ పరిశ్రమలో  పీక్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా చల్లబడింది. ఆ తర్వాత ఒకరిద్దరు మాత్రమే తమకు ఎదురైన అనుభవాలను వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీ టూ ఉద్యమం మొదలయ్యేలాగానే కనిపిస్తుంది. డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ తనను బలవంతం చేయబోయాడని నటి పాయల్‌ ఘోష్‌ ఓ వీడియో విడుదల చేసింది. అయితే అవి నిరాధారమైన ఆరోపణలంటూ అనురాగ్ కశ్యప ఖండించారు. ఈ క్రమంలో కంగనా రనౌత్‌ పాయల్‌ ఘోష్‌కు మద్దతు పలికింది. పాయల్‌ ఘోష్‌ కేవలం తనకు ఎదురైన అనుభవాలను వీడియో రూపంలో చెప్పడమే కాదు.. ఏకంగా ప్రధాని నరేంద్రమోడికి ట్విట్టర్‌ ద్వారా కంప్లైంట్‌ కూడా చేశారు. దీనిపై జాతీయ మహిళా కమీషన్‌ కార్యాలయం స్పందన తెలియజేసింది. సంస్థ ఛైర్మన్‌ రేఖా శర్మ ట్విట్టర్‌ వేదికగా పాయల్‌కు రిప్లయ్‌ ఇచ్చారు. జాతీయ మహిళా కమీషన్‌కు కంప్లైంట్‌ను మెయిల్‌ పూర్తి వివరాలతో మెయిల్‌ చేస్తే సమస్యను పరిశీలిస్తామని రేఖా శర్మ తెలిపారు. మరి పాయల్‌ ఘోష్‌ జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేస్తారో లేదో చూడాలి. 


Updated Date - 2020-09-20T20:06:48+05:30 IST