రేఖ సెక్యూరిటీ గార్డుకు క‌రోనా పాజిటివ్‌... ఆసుప‌త్రిలో చేరిక‌!

ABN , First Publish Date - 2020-07-12T10:18:36+05:30 IST

బాలీవుడ్ సీనియ‌ర్ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ నేప‌ధ్యంలో రేఖ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నమిగతా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు...

రేఖ సెక్యూరిటీ గార్డుకు క‌రోనా పాజిటివ్‌... ఆసుప‌త్రిలో చేరిక‌!

బాలీవుడ్ సీనియ‌ర్ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఈ నేప‌ధ్యంలో రేఖ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నమిగతా సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. క‌రోనా పాజిటివ్‌గా తేలిన రేఖ సెక్యూరిటీ గార్డు ఆసుప‌త్రిలో చేరి, చికిత్స పొందుతున్నారు. న‌టి రేఖ బంగ్లాను శానిటైజ్ చేశారు. కాగా దీనిపై న‌టి రేఖ నుంచి ఎటువంటి ప్రకటన వెలువ‌డ‌లేదు. కాగా ఇంత‌కు ముందు బాలీవుడ్ ప్ర‌ముఖులు అమిర్ ఖాన్, కరణ్‌జోహార్, బోనీకపూర్ త‌దిత‌రుల ద‌గ్గ‌ర ప‌నిచేసే సిబ్బంది కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. కాగా బాలీవుడ్ న‌టులు అమితాబ్‌, అభిషేక్ క‌రోనా బారిన ప‌డి ముంబైలోని నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-07-12T10:18:36+05:30 IST