నీవు ఆస్కార్ విన్నర్‌వి.. బాలీవుడ్ కంటే గొప్పోడివి.. రెహమాన్‌కు అండగా దర్శకుడు

ABN , First Publish Date - 2020-07-27T02:07:53+05:30 IST

బాలీవుడ్‌లో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రెహమాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్...

నీవు ఆస్కార్ విన్నర్‌వి.. బాలీవుడ్ కంటే గొప్పోడివి.. రెహమాన్‌కు అండగా దర్శకుడు

ముంబై: బాలీవుడ్‌లో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రెహమాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు. రెహమాన్‌కు అండగా నిలిచారు. రెహమాన్ ఆస్కార్ గెలుచుకున్నారని, ఆయన బాలీవుడ్ కంటే గొప్పవారని శేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘రెహమాన్ నీ సమస్యేంటో తెలుసా..? నీ ప్రతిభను నీవు గుర్తించలేవు. నీవు ఆస్కార్ గెలిపొందిన వ్యక్తి. ఆస్కార్ అంటే బాలీవుడ్ కంటే ఎంతో గొప్పది. అలాంటి ఆస్కార్‌ నీ చేతిలో ఉంది. అదొక్కటి చాలు నీ ప్రతిభ ఏంటో ప్రపంచానికి చెప్పడానికి’ అంటూ రాసుకొచ్చారు.Updated Date - 2020-07-27T02:07:53+05:30 IST

Read more