‘రెడ్‌’ పాటకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రయూనిట్‌ హ్యాపీ

ABN , First Publish Date - 2020-12-15T21:37:15+05:30 IST

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ హీరోగా సెన్సిబుల్‌ చిత్రాల దర్శకుడు కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెడ్‌'. ఈ చిత్రంలోని `కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...` పాట‌ను చిత్రయూనిట్‌ రీసెంట్‌గా

‘రెడ్‌’ పాటకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రయూనిట్‌ హ్యాపీ

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ హీరోగా సెన్సిబుల్‌ చిత్రాల దర్శకుడు కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెడ్‌'. ఈ చిత్రంలోని  `కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...` పాట‌ను చిత్రయూనిట్‌ రీసెంట్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట గురించి రీసెంట్‌గా పూరి జ‌గ‌న్నాథ్ `థీమ్ అదిరింది` అంటూ ట్విట్ట‌ర్‌లో స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేశారు. కొన్ని నిజాలు నిక్క చ్చిగా ఉంటాయి. అందులోనూ మ‌న హీరోలు వాటి గురించి మ‌రింత గ‌ట్టిగా చెబుతున్న‌ప్పుడు... ఆ భావాలు  శ్రోతల గుండెల్లోకి నేరుగా చొచ్చుకుని పోతుంటాయి. రీసెంట్ టైమ్స్ లో అలా జ‌నాల్లోకి వెళ్లిందే 'కౌన్‌ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...' అనే పాట‌. ఈ పాటకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా చిత్రయూనిట్‌ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 


ఈ సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కిశోర్ తిరుమ‌ల మాట్లాడుతూ.. ''సినిమాలో హీరో పాత్ర ఎలివేష‌న్ కోసం సంద‌ర్భానుసారంగా వ‌చ్చే పాటే కౌన్ హే అచ్చా.. కౌన్ హే లుచ్చా. గేయ ర‌చ‌యిత క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తికి సంద‌ర్భాన్ని వివ‌రించగానే ప‌ర్ఫెక్ట్ గా రాసిచ్చారు. ప్ర‌తి లైను బాగుందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. స‌న్నిహితులు కూడా చాలా మంది ఫోన్లు చేసి, మాన‌వ నైజాన్ని అద్భుతంగా చెప్పారంటున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారి బాణీని అనురాగ్ కుల‌క‌ర్ణి అద్భుతంగా సొంతం చేసుకుని పాడారు. ఆయ‌న స్వ‌రం పాట‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ తెచ్చిపెట్టింది. `రెడ్‌` నుంచి విడుద‌లైన ప్ర‌తి పాట‌నూ ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అని తెలుపగా.. ``రెడ్ నుంచి ఏ పాట విడుద‌లైనా ప్రేక్ష‌కులు చ‌క్క‌గా ఆద‌రిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ‌గారి స్వ‌రాల‌కు ఎంత గొప్ప ఆద‌ర‌ణ ఉంటుందో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఇంత‌కు ముందు రిలీజ్ చేసిన `డించ‌క్ డించ‌క్‌...`, `నువ్వే నువ్వే` పాట‌ల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇప్పుడు `కౌన్ హే అచ్చా... ` పాట‌కు ఎక్స్ ట్రార్డిన‌రీ స్పంద‌న వ‌స్తున్నందుకు యూనిట్ అంతా ఆనందంగా ఉంది. `రెడ్‌`కి సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాం. రామ్ నుంచి ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటారో... దానికి త‌గ్గ‌ట్టు ఉంటుంది సినిమా`` అని అన్నారు చిత్ర నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్. 



Updated Date - 2020-12-15T21:37:15+05:30 IST