`రెడ్` ట్రైలర్: రామ్ ద్విపాత్రాభినయం!

ABN , First Publish Date - 2020-12-24T18:00:48+05:30 IST

యంగ్ హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం `రెడ్`.

`రెడ్` ట్రైలర్: రామ్ ద్విపాత్రాభినయం!

యంగ్ హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


ఈ నేపథ్యంలో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక క్యారెక్టర్ సాఫ్ట్‌గా, మరో పాత్ర మాస్ యాంగిల్‌లో ఉంది. నివేద పోలీసాఫీసర్ పాత్రలో కనిపించింది. తమిళంలో విజయవంతమైన `తడమ్` చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికే విడుదలై విజయవంతమయ్యాయి. Updated Date - 2020-12-24T18:00:48+05:30 IST