లాక్‌డౌన్‌లో వినోదామృతం

ABN , First Publish Date - 2020-05-25T08:47:24+05:30 IST

బుల్లితెరపై 13 ఏళ్ల క్రితం ‘అమృతం’ సీరియల్‌ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వినోదం అంతర్జాల తెరపైకి వచ్చింది. ‘జీ 5’ ఓటీటీలో ఉగాదికి ‘అమృతం’కి కొనసాగింపుగా ‘అమృతం ద్వితీయం’...

లాక్‌డౌన్‌లో వినోదామృతం

బుల్లితెరపై 13 ఏళ్ల క్రితం ‘అమృతం’ సీరియల్‌ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ వినోదం అంతర్జాల తెరపైకి వచ్చింది. ‘జీ 5’ ఓటీటీలో ఉగాదికి ‘అమృతం’కి కొనసాగింపుగా ‘అమృతం ద్వితీయం’ వెబ్‌ సిరీస్‌ ప్రారంభమైంది. ప్రత్యేకంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో 2 వెబిసోడ్స్‌ తీశారు. ఆ రెండిటినీ బుధవారం (మే 27న) విడుదల చేయనున్నామని ‘జీ 5’ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల తెలిపారు. ‘‘వెబ్‌ సిరీస్‌లో మొత్తం 24 ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఇప్పటికి మూడు విడుదలయ్యాయి’’ అని దర్శకుడు సందీప్‌ గుణ్ణం అన్నారు. ‘‘జూన్‌ 25 నుంచి ప్రతి నెలా రెగ్యులర్‌ ‘అమృతం ద్వితీయం’ వెబిసోడ్స్‌ ప్రసారం అవుతాయి’’ అని ప్రసాద్‌ నిమ్మకాయల అన్నారు. అంజిగా ఎల్బీ శ్రీరామ్‌, అమృతంగా హర్షవర్ధన్‌, అప్పాజీగా శివన్నారాయణ తదితరులు నటించారు.

Updated Date - 2020-05-25T08:47:24+05:30 IST