రిలీజ్‌కు రెడీ...

ABN , First Publish Date - 2020-08-17T05:47:07+05:30 IST

తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితులైన కన్నడ హీరో శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సీతాయణం’. అనహిత...

రిలీజ్‌కు రెడీ...

తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితులైన కన్నడ హీరో శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సీతాయణం’. అనహిత భూషణ్‌ హీరోయిన్‌. ప్రభాకర్‌ ఆరిపాక దర్శకుడు. రోహన్‌ భరద్వాజ్‌ సమర్పణలో లలితా రాజ్యలక్ష్మి నిర్మించారు. తెలుగు, కన్నడతో పాటు తమిళంలో ఒకే రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘ఓ జంట ప్రేమాయణంలో ఏర్పడిన సమస్య ఎటువంటి మలుపు తీసుకుంది? దాని పర్యవసానం ఏంటి? హీరో ఎటువంటి పోరాటం చేశాడు? ఫలితం ఏంటి? అనేది చిత్రకథాంశం. త్వరలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తవుతాయి. పెళ్లి శుభలేఖపై శ్లోకాన్ని తొలిసారి పాట రూపంలో తీసుకొస్తున్నాం’’ అని దర్శకుడు అన్నారు. ‘‘మహిళలను గౌరవించండి... అనే ఉపశీర్షికకు న్యాయం చేసేలా ఉంటుందీ సినిమా. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన చిత్రాన్ని తమిళంలో అనువదిస్తున్నాం. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో టీజర్‌, ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అని లలితా రాజ్యలక్ష్మి అన్నారు. అజయ్‌ ఘోష్‌, విద్యుల్లేఖ, మధునందన్‌ నటించిన ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌, సంగీతం: పద్మనాభ్‌ భరద్వాజ్‌.

Updated Date - 2020-08-17T05:47:07+05:30 IST