నీతో మరోసారి పనిచేయాలనుకుంటున్నా: రవితేజ

ABN , First Publish Date - 2020-10-18T21:27:30+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ, కమర్షియల్‌ డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రాజాదిగ్రేట్‌'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

నీతో మరోసారి పనిచేయాలనుకుంటున్నా:  రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ, కమర్షియల్‌ డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రాజాదిగ్రేట్‌'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విడుదలై మూడేళ్లవుతుంది. బెంగాల్‌టైగర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న రవితేజ నటించిన చిత్రమిది. మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా హీరో రవితేజ తన ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. "రాజాదిగ్రేట్‌కు మూడేళ్ల సమయం పట్టింది. నాకెంతో దగ్గరైన చిత్రం. రాజా ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన అనీల్‌రావిపూడికి కృతజ్ఞతలు. నీతో వర్క్‌ చేయడాన్ని ఎంతో ఎంజాయ్‌ చేశాను. మరో సినిమాను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అన్నారు. దీనికి అనీల్ రావిపూడి ట్విట్టర్‌ ద్వారా థాంక్స్‌ చెప్పారు. మీతో పనిచేయడం గుర్తుండేపోయే అనుభవమన్నారు. ఈ చిత్రంలో రవితేజ కళ్లు కనిపించని దివ్యాంగుడిగా నటించారు. 
Updated Date - 2020-10-18T21:27:30+05:30 IST