నేను రెడీ అంటున్న మాస్‌ మహారాజా

ABN , First Publish Date - 2020-09-16T16:21:51+05:30 IST

మాస్‌రాజా రవితేజ తన తాజా చిత్రం 'క్రాక్‌' షెడ్యూల్‌కి ఓకే చెప్పారట. అక్టోబర్‌ 1 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది.

నేను రెడీ అంటున్న మాస్‌ మహారాజా

మన స్టార్స్‌ అందరూ కోవిడ్‌ ప్రభావం నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌స్టార్ట్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ అక్కినేని సహా మరికొందరు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో మాస్‌రాజా రవితేజ తన తాజా చిత్రం 'క్రాక్‌' షెడ్యూల్‌కి ఓకే చెప్పారట. అక్టోబర్‌ 1 నుండి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు నిర్మిస్తోన్న చిత్రమిది. పదిహేను, ఇరవై రోజుల షూటింగ్‌ జరిగితే చిత్రీకరణంతా పూర్తవుతుంది. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అప్పటికి థియేటర్స్‌ ఓపెన్‌ అవుతాయా?  లేదా? అనే దానిపై ఉండే క్లారిటీని బట్టి సినిమా విడుదలపై మేకర్స్‌ ఓ అవగాహనకు వచ్చే అవకాశం ఉందని టాక్‌. 'డాన్‌శీను',' బలుపు' చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్‌ మూవీ 'క్రాక్'.  శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 


Updated Date - 2020-09-16T16:21:51+05:30 IST