'క్రాక్‌' కోసం రవితేజ డబ్బింగ్‌

ABN , First Publish Date - 2020-12-29T21:08:12+05:30 IST

క్రాక్ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రవితేజ డబ్బింగ్‌ చెబుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి.

'క్రాక్‌' కోసం రవితేజ డబ్బింగ్‌

డాన్‌ శీను, బలుపు చిత్రాల తర్వాత మాస్‌ మహారాజా రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. అలాగే కొత్త సంవత్సరం రోజున ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్‌. సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రవితేజ డబ్బింగ్‌ చెబుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆక‌ట్టుకునే అంశాలున్నాయని చిత్రయూనిట్‌ తెలిపింది. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌ఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. 

Updated Date - 2020-12-29T21:08:12+05:30 IST