రవితేజ రూ.10 లక్షల విరాళం!

ABN , First Publish Date - 2020-10-21T02:49:35+05:30 IST

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రవితేజ రూ.10 లక్షల విరాళం!

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకునేందుకు ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.


తాజాగా మాస్ మహారాజ్ రవితేజ కూడా స్పందించాడు. తన వంతుగా రూ.10 లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించాడు. `ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం సహాయ నిధికి నేను రూ.10 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరుతున్నాన`ని రవితేజ ట్వీట్ చేశాడు. 

Updated Date - 2020-10-21T02:49:35+05:30 IST