రవికుమార్‌ ‘ఫ్లాష్‌బ్యాక్‌’

ABN , First Publish Date - 2020-08-25T05:21:16+05:30 IST

ఆద్యా ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ‘ఫ్లాష్‌బ్యాక్‌’ పేరుతో ఓ భారీ చిత్రం నిర్మించనుంది. రవికుమార్‌ చౌదరి పుట్టినరోజు సందర్భంగా...

రవికుమార్‌ ‘ఫ్లాష్‌బ్యాక్‌’

ఆద్యా ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో ‘ఫ్లాష్‌బ్యాక్‌’ పేరుతో ఓ భారీ చిత్రం నిర్మించనుంది. రవికుమార్‌ చౌదరి పుట్టినరోజు సందర్భంగా సోమవారంనాడు చిత్ర నిర్మాత కార్తీకరెడ్డి ఈ చిత్రం ప్రకటించారు. ‘లేనిది ఎవరికి?’అనేది ఉపశీర్షిక. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి కరోనా నిబంధనలు అనుసరించి షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రవికుమార్‌ చౌదరి చెప్పారు. అలాగే తన మాతృ సంస్థ ఈతరం ఫిల్మ్స్‌ నిర్మించే చిత్రానికి కథాచర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-25T05:21:16+05:30 IST