ఆయన లెజెండ్ అనే పదానికి నిజమైన నిర్వచనం: రవితేజ

ABN , First Publish Date - 2020-10-12T00:51:00+05:30 IST

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 11). నేటితో ఆయన 78 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా

ఆయన లెజెండ్ అనే పదానికి నిజమైన నిర్వచనం: రవితేజ

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ పుట్టినరోజు నేడు(అక్టోబర్‌ 11). నేటితో ఆయన 78 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లెజెండ్ అనే పదానికి నిజమైన నిర్వచనమైన అమితాబ్‌ జీకి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు మాస్‌ రాజా రవితేజ. ట్విట్టర్‌ ద్వారా బిగ్‌ బికి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వాస్తవానికి మాస్‌ రాజా రవితేజకి అమితాబ్‌ అంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. అమితాబ్‌ని అమితంగా అభిమానించే అభిమానుల్లో ఒకరు రవితేజ. ఈ విషయం ఆయన ఎన్నో సందర్భాలలో తెలిపారు. ఒక సినిమాలో ఆయనకి అభిమానిగా కూడా రవితేజ నటించారు. "లెజెండ్ అనే పదానికి నిజమైన నిర్వచనమైన అమితాబ్‌జీకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, చిరునవ్వులు చిందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను." అని ట్వీట్‌లో పేర్కొన్న రవితేజ.. ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేశారు.Updated Date - 2020-10-12T00:51:00+05:30 IST

Read more