సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పగ, ప్రతీకారంతో కాకుండా... ‘ఆర్జీవీ’!

ABN, First Publish Date - 2020-08-08T06:35:36+05:30

‘‘మనకంటే మనం తీసిన సినిమా మాట్లాడాలని అనుకునే వ్యక్తిని నేను. ద్వేషంతోనో, ప్రతీకారంతోనో కాకుండా... మంచి కథ, పేరున్న ఆర్టిస్టులతో రూ. 4 కోట్లతో మేం తీస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మనకంటే మనం తీసిన సినిమా మాట్లాడాలని అనుకునే వ్యక్తిని నేను. ద్వేషంతోనో, ప్రతీకారంతోనో కాకుండా... మంచి కథ, పేరున్న ఆర్టిస్టులతో రూ. 4 కోట్లతో మేం తీస్తున్న ‘రోజూ గిల్లే వాడు’ విడుదలయ్యాక మాట్లాడుతుంది. సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రమిది. థియేటర్లలో విడుదల చేయాలని తీస్తున్నాం’’ అని బొగ్గరమ్‌ వెంకట శ్రీనివాస్‌ అన్నారు. ‘కార్తికేయ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆయన, సుమంత్‌ ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రానికి కథ అందించారు. ప్రస్తుతం జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో ‘రోజూ గిల్లే వాడు’ (ఆర్జీవీ)కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శనివారం శ్రీనివాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్రసీమలో 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘పెళ్ళాం పిచ్చోడు’కి సహ నిర్మాత ప్రయాణం ప్రారంభించా. తర్వాత ఎనిమిదేళ్లు పరిశ్రమకు దూరంగా ఉన్నాను. మళ్లీ ‘కార్తికేయ’ విజయంతో ప్రయాణం మొదలుపెట్టా. ఆ తర్వాత నారా రోహిత్‌, నాగశౌర్య హీరోలుగా ‘కథలో రాజకుమారి’ తీశా. నా కథతో ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రారంభించా. మా నిర్మాణ భాగస్వామి సుధాకర్‌రెడ్డి సినిమా మొత్తం తాను చేసుకుంటానంటే... ఆయన సంస్థలో పూర్తి చేశాం. ఇప్పుడు సెటైరికల్‌ బయోపిక్‌ ‘రోజూ గిల్లే వాడు’ (ఆర్జీవీ) చేస్తున్నాం. తొలుత ‘ఆర్జీవీ సైకో బయోపిక్‌’ టైటిల్‌ అనుకున్నాం. ఛాంబర్‌ రిజెక్ట్‌ చేయడంతో ‘ఆర్జీవీ’ ఉపశీర్షికతో ‘రోజూ గిల్లే వాడు’ అని నేనే టైటిల్‌ పెట్టాను. ఆర్జీవీ పాత్రలో సీనియర్‌ హీరో సురేశ్‌ నటిస్తున్నారు. రాశీ, శ్రద్ధా దాస్‌ వంటి పేరున్న ఆర్టిస్టులను తీసుకున్నాం. పగ, ప్రతీకారంతో కాకుండా మంచి స్ర్కిప్ట్‌ రెడీ చేసుకుని చేస్తున్నాం. ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌’ పేరుతో పర్వర్షన్‌లోకి దిగిన ఒక జీనియస్‌ మాట్లాడిన మాటల వల్ల ఓ కుటుంబానికి ఎంత నష్టం కలిగింది? ఆ కుటుంబంలో ఓ కుర్రాడు ‘పప్పు వర్మ’ పేరుతో ఎటువంటి సినిమా తీశాడనేది కథ. ఇందులో సందేశమూ ఉంటుంది. చిత్రసీమ మీద ఆధారపడి జీవిస్తూ, చిత్రసీమ వల్ల విజయాలు అందుకుని గొప్పస్థాయికి వచ్చిన తర్వాత ప్రముఖులపై వ్యంగ్యంగా లఘుచిత్రాలు తీస్తూ చిత్రసీమ స్థాయిని ఎలా దిగజారుస్తున్నాడనేది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. రాజశేఖర్‌గారు హీరోగా తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ, నీలకంఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. ‘ఆర్జీవీ’తో పాటు ఆ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

Updated Date - 2020-08-08T06:35:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!