మరచిపోలేకపోతున్నానంటున్న రష్మిక.. ఇంతకూ వీడియోలో ఏముందంటే..!

ABN , First Publish Date - 2020-10-05T17:36:38+05:30 IST

కన్నడ సోయగం లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్లు ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌ చూస్తే అర్థమవుతుంది. బెంగుళూరుతో పాటు మరోచోట కూడా రష్మిక ఎంజాయ్‌ చేసినట్లు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తుంది.

మరచిపోలేకపోతున్నానంటున్న రష్మిక.. ఇంతకూ వీడియోలో ఏముందంటే..!

కన్నడ సోయగం లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేసినట్లు ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌ చూస్తే అర్థమవుతుంది. బెంగుళూరుతో పాటు మరోచోట కూడా రష్మిక ఎంజాయ్‌ చేసినట్లు రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేస్తుంది. ఇటీవల బీచ్‌లో రష్మిక చేసిన వర్కవుట్‌ బాగా వైరల్‌ అయ్యింది. అంతే కాదండోయ్‌.. తనకు సముద్రాన్ని చూస్తే అపరిమితమైన అవకాశాలు కనిపిస్తాయని కూడా వేదాంత దోరణిలో ఆమె పోస్ట్‌ చేసిన మరో వీడియో కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. అయితే ఇంతకూ రష్మిక ఎక్కడుంది, ఏం చేస్తుంది? అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెబుతూ రష్మిక ఈరోజు మరో వీడియో పోస్ట్‌ చేసింది. రష్మిక గోవాలో ఎంజాయ్‌ చేశానని, ఆ సమయాన్ని మరచిపోలేకపోతున్నానని చెబుతూ రష్మిక మందన్నా పోస్ట్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ప్రారంభం కానున్న 'పుష్ప' సినిమా షూటింగ్‌లో రష్మిక మందన్నా పాల్గొనబోతుంది. 
Updated Date - 2020-10-05T17:36:38+05:30 IST

Read more