`సుల్తాన్` సినిమా హిట్ కావాలి: రష్మిక

ABN , First Publish Date - 2020-10-08T19:25:56+05:30 IST

`కిర్రాక్ పార్టీ`తో కన్నడ నాట గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మికా మందన్నా

`సుల్తాన్` సినిమా హిట్ కావాలి: రష్మిక

`కిర్రాక్ పార్టీ`తో కన్నడ నాట గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రష్మికా మందన్నా `ఛలో`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పలువురు అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది. మరోవైపు తమిళంలోనూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రముఖ హీరో కార్తీ `సుల్తాన్` సినిమాతో కోలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. 


లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తియింది. మిగిలిన షూటింగ్‌ను చిత్రబృందం తాజాగా పూర్తి చేసింది. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తీసిన ఫొటోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `తమిళంలో నా తొలి సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. `సుల్తాన్` హిట్ కావాలని కోరుకుంటున్నా` అంటూ కామెంట్ చేసింది.  Updated Date - 2020-10-08T19:25:56+05:30 IST