ఉపాసనతో రష్మిక!

ABN , First Publish Date - 2020-11-14T18:37:54+05:30 IST

జీవితాన్ని మరింత అందమైన, అర్థవంతమైన లెన్స్‌తో చూడమని సూచిస్తున్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన

ఉపాసనతో రష్మిక!

జీవితాన్ని మరింత అందమైన, అర్థవంతమైన లెన్స్‌తో చూడమని సూచిస్తున్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసన. ఇటీవల `యువర్ లైఫ్` వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి దాని ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఉపాసన వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వెబ్ పోర్టల్‌కు ప్రముఖ కథానాయిక రష్మికా మందన్న గెస్ట్ ఎడిటర్‌గా హాజరైంది. తనకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను, పోషకాహార తయారీ వివరాలను పంచుకుంది. 


రష్మికతో కలిసి దిగిన ఫొటోను ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. `జీవితాన్ని మరింత అందమైన, అర్థవంతమైన లెన్స్‌తో చూడండి. ఈ దీపావళి ఎంత సరదాగా ఉండాలని లేదా ఎంత బోరింగ్‌గా ఉండాలని మీరు అనుకుంటారో.. అలాగే ఉంటుంది. నిర్ణయించుకోవాల్సింది మీరే. నేను మాత్రం రష్మికతో మాట్లాడడాన్ని బాగా ఆస్వాదించా. చాలా సరదాగా ఉండే ఆమె మనస్తత్వం మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంద`ని ఉపాసన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పోర్టల్‌కు సమంత గెస్ట్ ఎడిటర్‌గా హాజరై పలు ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 




Updated Date - 2020-11-14T18:37:54+05:30 IST